రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి, రేగిడి, వంగర, రాజాం మండలాల డిప్యూటీ తాసిల్దార్ లు, వ్యవసాయ అధికారులతో ధాన్యం కొనుగోలు పై చీపురుపల్లి ఆర్డీవో సత్యవాణి శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గన్ని బ్యాగులను రైతులకు మిల్లర్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ధాన్యం తరలించే వాహనాలు రిజిస్ట్రేషన్ శత శాతం సత్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు పై అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.