ఆసియాలోనే 'క్లీనెస్ట్ విలేజ్' ఎక్కడుందో తెలుసా?

ఆసియా ఖండంలోనే 'క్లీనెస్ట్ విలేజ్'గా మేఘాలయలోని మయలిన్నాంగ్ నిలిచింది. ఈ ఊరిలో మొత్తం 500 మంది వరకు నివసిస్తున్నారు. వీరే స్వయంగా తమ ఊరిని శుభ్రపరుచుకుంటారు. అది వారి బాధ్యతగా భావిస్తారు. అలాగే ఇక్కడి ప్రజలు ప్రకృతికి, పర్యావరణానికి పెద్దపీట వేస్తారు. దానికి ఇబ్బంది కలిగేలా ఏ చిన్న తప్పు చేసినా, అపరిశ్రుభంగా కనిపించినా కఠిన శిక్షలు అమలు చేస్తారు. ఈ గ్రామంలో ప్లాస్టిక్, పొగ తాగటం పూర్తిగా నిషేధించారు.

సంబంధిత పోస్ట్