TG: భూమిలేని వ్యవసాయ కూలీలకు 'ఇందిరమ్మ ఆత్మీయ భరోసా' పథకం పేరుతో ఆర్థిక భరోసా కల్పించేందుకు సీఎం రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.12 వేలు రెండు విడతల్లో అందించనుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఉపాధి హామీ జాబ్ కార్డు తప్పనిసరి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి పనులు చేసి ఉండాలి. అలాగే ఆధార్, రేషన్ కార్డుల ద్వారా కూలీల కుటుంబాలను యూనిట్ గా అధికారులు గుర్తిస్తారు. కుటుంబంలో ఎవరికీ వ్యవసాయ భూమి ఉన్నా అనర్హులే.