రష్యాలోని బ్లాగోవెష్చెంస్క్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ కారు డ్రైవర్ అతివేగంగా వాహనాన్ని నడిపాడు. ఈ క్రమంలో కారు అదుపు తప్పింది. దీంతో ఫుట్‌పాత్‌పైకి నేరుగా మెరుపు వేగంతో కారు దూసుకెళ్లింది. ఫుట్‌పాత్‌పై ఉన్న 12 మందిని ఆ కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో ఏడుగురిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.