ఐఏఎస్ కృష్ణతేజకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్

75చూసినవారు
ఐఏఎస్ కృష్ణతేజకు అభినందనలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
జాతీయ బాలల రక్షణ కమిషన్ పురస్కారానికి తెలుగు ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ఎంపికయ్యారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కృష్ణతేజను అభినందించారు. ఆయన మరిన్ని సేవలు అందిస్తూ ఉద్యోగులు, యువతకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. కరోనా, కేరళ వరదల సమయంలో ఆయన అందించిన సేవలను ప్రజలు మరచిపోలేదని పవన్‌ తెలిపారు. కాగా, కృష్ణతేజ.. కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.

సంబంధిత పోస్ట్