కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం (వీడియో)

83చూసినవారు
యూపీలోని ఘజియాబాద్‌లో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. అందులో కొందరు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది. ప్రస్తుతం అగ్నిమాపక బృందాలు అక్కడకు చేరుకున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్