ఏఐపై భారత విద్యార్థులకు ఒరాకిల్ శిక్షణ

69చూసినవారు
ఏఐపై భారత విద్యార్థులకు ఒరాకిల్ శిక్షణ
ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ టెక్నాలజీలపై 2 లక్షల మంది భారత విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఒరాకిల్ ప్రకటించింది. ఇప్పటికే తమిళనాడు నైపుణ్యాభివృద్ధి ఆధ్వర్యంలో నాన్ ముదల్వన్ అనే కార్యక్రమం ప్రారంభించింది. ఒరాకిల్ సర్టిఫికెట్‌ను ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా గుర్తిస్తారని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ శైలేందర్ తెలిపారు. యువత జ్ఞానాన్ని పెంచడంతోపాటు కంపెనీలు కోరుకునే నైపుణ్యాలనూ అందిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్