గంగమ్మ జాతరలో వేషాల జోరు

తిరుపతి గంగమ్మ జాతరకు ప్రధాన ఆకర్షణ వేషాలు. ప్రధానంగా జాతరలో బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, మాతంగి వేషం, సున్నపు కుండల వేషం, చివరగా దొర వేషం ధరించి భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా వేషాలు ధరించి మొక్కులు తీర్చుకుంటారు. వీటితోపాటు ఆడవేషం, దేవుళ్ళ వేషం, పౌరాణిక ప్రముఖుల వేషాలు ధరించి గంగమ్మ ఆశీర్వాదం పొందుతారు. అందుకే ఇది వేషాల జాతరగా ప్రసిద్ధికి ఎక్కింది.

సంబంధిత పోస్ట్