రైతుల పంట పొలాలకు నీళ్లు అందించండి

సాగర్ కాలువకు ఇటీవల వరదల వల్ల గండి పడటంతో నీరు రాక పొలాలు ఎండిపోతున్నాయని, త్వరగా సాగర్ కాలువ పనులు పూర్తి చేసి రైతుల పంట పొలాలకు నీళ్లు అందించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి కలెక్టర్ ను కోరారు. గురువారం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. సత్తుపల్లి సింగరేణి ప్రభావిత ప్రాంతాల గ్రామాలు, వరదల వల్ల నియోజకవర్గంలో జరిగిన నష్టం గురించి జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్