అనుమతి లేకుండానే ప్రభుత్వ ఆస్థి ధ్వంసం

షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఫరూఖ్ నగర్ మండలం అన్నారం గ్రామంలో ఉన్న అంగన్ వాడి భవనాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా శుక్రవారం యంత్రాలతో కూల్చివేశారు. అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్న పిల్లలను ప్రాథమిక పాఠశాలకు అనుసంధానం చేయడంతో అక్కడ ఉన్న భవనం ఖాళీగా ఉంది. దాంతో శిథిలవస్థకు చేరుకుందని ఏకంగా రాజకీయ నాయకులు కూల్చివేశారు. ఇదేమని గ్రామస్తులు ప్రశ్నిస్తుంటే పొంతనలేని మాటలు చెబుతూ దాటవేస్తున్నారు.

సంబంధిత పోస్ట్