సంక్రాంతి పండగ రోజు తెలంగాణ రైతాంగానికి పసుపు బోర్డును ప్రధాని నరేంద్ర మోడీ బహుమతిగా ఇచ్చారని బుధవారం ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పడుకున్నారని ఆయన ఆగ్రహించారు. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని ఎంపీ జోస్యం చెప్పారు.