మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలి: అదనపు కలెక్టర్

ప్రతి ఒక్కరు మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రసాయన విగ్రహాల వల్ల చెరువులు కలుషితం అవుతాయని చెప్పారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారి గీత, కలెక్టరేట్ ఏవో పరమేశం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్