పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలతో సరిపెట్టింది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరబాయిచాను ఒక్క కిలో తేడాతో ఒలింపిక్స్‌ల్లో పతకాన్ని గెలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్ సాధించిన ఏకైక భారత్ అథ్లెట్‌గా నిలిచే ఘనతను షూటర్ మను బాకర్ తృటిలో కోల్పోయింది. 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగట్.. ఆమెపై నిర్వాహకులు అనర్హత వేటు వేయడంతో పతకం దూరమైంది.