వరంగల్ కలెక్టరేట్ లో జూనియర్ డాక్టర్ల ధర్నా

కోల్ కత్తాలో వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనను నిరసిస్తూ వరంగల్ జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. దుండగులను కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రాణం పోసే చేతులకు న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్