వయనాడ్ కు 121 మంది మానసిక నిపుణులు

82చూసినవారు
వయనాడ్ కు 121 మంది మానసిక నిపుణులు
వయనాడ్ ఘటన దృష్ట్యా కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వయనాడ్ బాధితులకు మానసికంగా అండగా నిలిచేందుకు 121 మంది మానసిక నిపుణుల బృందాన్ని సిద్ధం చేసింది. వారిని వయనాడ్ కు పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కళ్లముందే భారీ విధ్వంసం, కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం, ఆస్తి నష్టం వంటి విషాదాల నుంచి ప్రజలను బయట పడేసేలా ఈ బృందం పని చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్