పీజీ మెడికల్ సీట్లకు 1,419 దరఖాస్తులు

70చూసినవారు
పీజీ మెడికల్ సీట్లకు 1,419 దరఖాస్తులు
ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ప్రస్తుత విద్యా సంవత్సరానికి మిగిలిన పీజీ మెడికల్ కన్వీనర్, యాజమాన్య సీట్ల ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారి జాబితాను విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు విడుదల చేశారు. కన్వీనర్ కోటాకు 591, యాజమాన్య కోటాకు 828 మంది కలిపి మొత్తం 1,419 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 69 మంది అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్