తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో అపచారం చోటుచేసుకుంది. కొండపై కోడి గుడ్ల కూర, పలావ్‌తో కూడిన పొట్లం లభ్యమైంది. భక్తుల ఫిర్యాదుతో తనిఖీ చేయగా తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలోని గుమ్మడిపూడి గ్రామానికి చెందిన వారు వాటిని తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు. భద్రతా సిబ్బంది వైఫల్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.