టీమిండియా యువ సెన్సేషన్ రింకూ సింగ్ పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమయ్యాడని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరిగింది. యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ వివాహ నిశ్చితార్థ కార్యక్రమం కూడా జరిగిందని వార్తలొచ్చాయి. అయితే, ఈ నిశ్చితార్థ వార్తలను ఎంపీ ప్రియా సరోజ్ తండ్రి తుషానీ సరోజ్ ఖండించారు. పెళ్లిపై ఇంకా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. పెద్దలు ఒప్పుకుంటే వారిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని చెప్పారు.