ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత ఎవరో చెప్పేసిన గవాస్కర్

84చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత ఎవరో చెప్పేసిన గవాస్కర్
ఫిబ్రవరి 19వ తేదీ నుంచి పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ 2025 టోర్నీ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ ఈ టోర్నీ విజేతగా ఎవరు గెలుస్తారో అంచనా వేశారు. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ తిరిగి విజేతగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. ఆతిథ్య దేశంగా పాకిస్థాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. ఇక ఈ టోర్నీలో భారత్ మ్యాచ్‌లు దుబాయ్ వేదికగా జరగనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్