చేతబడి నెపంతో వృద్ధురాలిపై దాడి

67చూసినవారు
చేతబడి నెపంతో వృద్ధురాలిపై దాడి
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. చేతబడి చేస్తోందన్న అనుమానంతో 77 ఏళ్ల వృద్ధురాలిపై గ్రామస్థులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమెకు బలవంతంగా మూత్రం తాగించారు. ఆమె మెడలో చెప్పుల దండను వేసి ఊరేగించారు. చిఖల్‌దరా తాలుకాలోని రెత్యఖేడా గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై వృద్ధురాలి కొడుకు, కోడలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత పోస్ట్