బీసీలపై 26 వేల కేసులు పెట్టారు: సునీత

66చూసినవారు
బీసీలపై 26 వేల కేసులు పెట్టారు: సునీత
శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లిలో సోమ‌వారం జ‌రిగిన ‘జయహో బీసీ’ ర్యాలీలో టీడీపీ నేత పరిటాల సునీత పాల్గొన్నారు. బీసీ యువత, టీడీపీ బీసీ కార్యకర్తలతో కలిసి ఆమె ర్యాలీని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సునీత మాట్లాడుతూ.. బీసీలను మానసికంగా దెబ్బతీయడానికి 26 వేల అక్రమ కేసులు పెట్టార‌ని మండిప‌డ్డారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నార‌ని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్