వరదలో కొట్టుకుపోతున్న వీధికుక్కను కాపాడిన ఎమ్మెల్యే (వీడియో)

61చూసినవారు
ఏపీలో విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. బుడమేరు వాగు ఉధృతికి నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. బాధితుల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. ఇక ఈ వరదల్లో మూగజీవాలు ప్రాణాలు కాపాడుకునేందుకు కొట్టుమిట్టాడుతున్నాయి. సహాయక చర్యల్లో పాల్గొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వరదలో కొట్టుకుపోతున్న కుక్క కనిపించింది. దీంతో ఆ కుక్కను ఎమ్మెల్యే కాపాడి, సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు.

సంబంధిత పోస్ట్