విజయవాడలో ముంపునకు కారణమైన బుడమేరు మైలవరం కొండల్లో పుట్టింది. ఆరిగిపల్లి, కొండపల్లి అనే కొండల మధ్య మొదలవుతుంది. కొల్లేరు సరస్సుకు నీటిని సరఫరా చేస్తుంది. ఈ వాగులో ఏడాది పొడవునా నీళ్లుంటాయి. సాధారణంగా ఏటా గరిష్టంగా 10 వేల నుంచి 11 వేల క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తుంది. ఇది చాలా మలుపులు తిరుగుతూ ప్రవహిస్తుండటంతో ఎక్కువ ప్రవాహం వస్తే నీరు గట్టు దాటుతుంది. దాంతో చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని వరద నీరు చేరుతోంది.