విజయవాడ డాబాకొట్ల రోడ్డులోని ఓ ఇంటిని వరద నీరు చుట్టుముట్టేసింది. ఆ ఇంట్లో నెలలు నిండిన గర్భిణీ రెండు రోజులుగా కష్టాలను ఎదుర్కొంది. వరద వల్ల కంటి మీద కునుకు లేదు. సాయం అడిగినా స్పందించేవారు లేరు. ఈ క్రమంలో ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఇంట్లోనే గర్భిణీ ప్రసవించింది. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలింత పడుతున్న కష్టం నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు దృష్టికి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో ఆయన ఆ ఇంటికి వెళ్లి.. పడవలో సురక్షితంగా ఆస్పత్రికి తీసుకొచ్చారు.