ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు

70చూసినవారు
ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు
ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు నిర్మించేందుకు పరిశీలన చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, అన్నవరం, నాగార్జునసాగర్, కుప్పం, అనంతపురం, నెల్లూరులో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. అలాగే విజయవాడ-శ్రీశైలం మధ్య సీ ప్లేన్ ప్రారంభిస్తామన్నారు. దీనికి సంబంధించిన డెమోను అక్టోబర్‌లో నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్