ఏపీలో బీజేపీ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలని ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తోంది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలపైన కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పలువురు పేర్లు రేసులో ఉండగా.. బీజేపీ నాయకత్వం సామాన్య కార్యకర్తకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏబీవీపీ, బీజేపీ యువమోర్చాలో పని చేసి.. బీజేపీలో పని చేస్తున్న ఉత్తరాంధ్రకు చెందిన ఒక బీసీ నాయకుడి పేరు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.