తెలంగాణ మంత్రి సీతక్క విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసి అందరిలో జోష్ నింపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ములుగులో జరిగిన రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. యువతీయువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు. ఈ 3K రన్ ప్రారంభానికి ముందు సీతక్క డీజే టిల్లు పాటకు డ్యాన్స్ చేశారు. అక్కడున్న యువతీ యువకుల్లో ఆమె జోష్ నింపారు.