YELLOW ALERT: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

69చూసినవారు
YELLOW ALERT: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
TG: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో తెలంగాణకు ఎల్లో అలెర్ట్​ జారీ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్