తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రేమ జంట సూసైడ్ కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో 450వ మెట్టు దగ్గర పురుగుల మందు తాగి ప్రేమ జంట ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. వారిని చిత్తూరుకు చెందిన సతీష్, రాధికలుగా గుర్తించారు. ఇది గమనించిన భక్తులు టీటీడీ సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. వారిని 108 వాహనంలో రుయా ఆసుపత్రికి తరలించారు.