విజయసాయి రెడ్డి శకుని లాంటి వ్యక్తి అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం విశాఖలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. 'వైసీపీ పాపాలు బయటపడుతుంటే ట్వీట్లు పెరుగుతున్నాయి. విజయసాయి, వైవీ సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులు నేరాల్లో భాగస్వాములయ్యారని బయటకు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి పట్ల విజయసాయి మాటలు బాధాకరం. కాకినాడ పోర్ట్ వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.' అని మంత్రి అన్నారు.