మలేషియాలోని తాజాగా షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి భారీ పైథాన్ ప్రత్యక్షమైంది. అనుమానమొచ్చి సీలింగ్ పరిశీలించగా.. 20 అడుగులు పొడవున్న భారీ సైజులో పైథాన్ ఒకటి బయటపడింది. దాన్ని చూడగానే అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే రెస్క్యూ టీంకి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని అతికష్టం మీద సీలింగ్ నుంచి దాన్ని బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.