చిన్న సందేశం పంపాలన్నా, వీడియోలు షేర్ చేయాలన్నా వెంటనే గుర్తుకు వచ్చేది వాట్సాప్. దీంతో పెద్ద ఎత్తున సందేశాలు వచ్చి చేరుతుంటాయి. వాటిలో ముఖ్యమైనవి చూసేసి.. మిగిలినవి చూద్దాం అనుకుంటూ అలానే వదిలేస్తాం. అలా వదిలేసిన చాట్‌లను రిమైండ్ చేయాలనే ఉద్దేశంతో వాట్సప్ కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. వాట్సప్‌లో రానున్న కొత్త ఫీచర్ మెసేజ్ రిమైండర్. ఇది చదవకుండా వదిలేసిన సందేశాల్ని గుర్తుచేస్తుంది.