TG: వికారాబాద్ జిల్లాలో విషాదం జరిగింది. నవాబ్ పేట మండలానికి చెందిన అరుంధ అనే వివాహిత మేకలను మేపేందుకు కూతురు, కొడుకును తీసుకొని బావి వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో కూతురిని బావిలో పడేయాలని చూడగా.. అమ్మ నన్ను బావిలో వెయ్యకు అని కూతురు ప్రజ్వల వేడుకోవడంతో తనను ఇంటికి పంపించింది. అనంతరం కొడుకు రిత్విక్‌ను బావిలో పడేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, కుటుంబ కలహాలతో అరుంధ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.