ఈ నెల 9న తెలంగాణ బంద్

52చూసినవారు
ఈ నెల 9న తెలంగాణ బంద్
తెలంగాణలో డిసెంబర్ 9న మావోయిస్టు పార్టీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఇటీవల ములుగు జిల్లాలోని చల్పాక అడవుల్లో డిసెంబరు 1వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఈ నెల 9న తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఈ బంద్‌లో ప్రజల స్వచ్ఛందంగా పాల్గొనాలని, దీనిని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్