బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌పై తాజాగా కేసు నమోదైంది. హిందువుల పవిత్ర పండగైన హోలీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వికాశ్ ఫటక్ అనే వ్యక్తి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే ఫిబ్రవరి 20న టెవిజన్ షో సెలబ్రిటీ మాస్టర్ చెఫ్‌లో హోలీని ‘ఛప్రీల పండుగ’గా ఫరా ఖాన్ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు హిందువుల భావాలను అవమానించేలా ఉన్నాయని ఆయన కేసు నమోదు చేశారు.