మదనపల్లెలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య

68చూసినవారు
మదనపల్లెలో వైసీపీ కార్యకర్త దారుణ హత్య
AP: అన్నమయ్య జిల్లాలో ఘాతుకం జ‌రిగింది. మదనపల్లి శ్రీవారి నగర్‌లో వైసీపీ కార్యకర్త ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతుడ్ని పుంగనూరు శేషాద్రిగా పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుఝామున శేషాద్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. హత్యకు వ్యక్తిగత గొడవలా? లేదంటే రాజకీయ కక్షలు కారణమా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్