AP: నెల్లూరు జిల్లా రాపూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాపూరులోని తిక్కన పార్కు వద్ద బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సరస్వతి(40), సురేశ్ (30) మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.