TG: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. మొత్తం 10 నుంచి 15 సిట్ బృందాలు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఈయన కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఈ కేసు విచారణకు హాజరు కావాలని సిట్ కోరినా గైర్హాజరవుతూ వచ్చారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారు. తాజాగా సిట్ అతడి ఇంట్లో సోదాలు చేపట్టింది.