చిత్తూరు జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతోంది. నెల్లూరు పూతలపట్టుకు చెందిన సాయితేజను ఫిబ్రవరి 9న ప్రేమించి పెళ్లి చేసుకున్న యాస్మిన్ భానుకు ఫిబ్రవరి 13న పోలీసులు రక్షణ కల్పించారు. ఇటీవల తండ్రి సీరియస్‌గా ఉందని చెప్పి పుట్టింటికి వెళ్లిన ఆమె అర్ధరాత్రి మృతిచెందింది. "పరువు తీసావు" అని తండ్రి తిట్టడంతో ఉరేసుకుందని తల్లి స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, ఇంట్లో ఉరి వేసుకున్న ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో పోలీసులు పరువు హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.