UP CM యోగి ఆదిత్యనాథ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పేదరిక నిర్మూలన పథకాన్ని అంబేద్కర్‌కు అంకితం చేస్తానని ప్రకటించారు. ఈ పథకం ఇకపై అంబేద్కర్ పేరుతోనే పిలవబడుతుందని తెలిపారు. అంబేద్కర్ మహాసభ క్యాంపస్‌లో జరిగిన సభలో మాట్లాడుతూ, "UP పేదరికం నిర్మూలనలో తొలి అడుగు వేసింది. ‘'జీరో పావర్టీ' స్కీమ్’ కింద 14 నుంచి 15 లక్షల కుటుంబాలను అన్ని సౌకర్యాలతో కలిపే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం" అని సీఎం పేర్కొన్నారు.