30 ఏళ్ల క్రితం చేసిన తప్పుకు ఐస్‌లాండ్‌కు చెందిన ఓ మంత్రి రాజీనామా చేశారు. విద్య, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పని చేస్తున్న అస్థిల్దూర్ లోవా థోర్సోడొట్టిర్ 16 ఏళ్ల మైనర్ బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ బంధంతో ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఐస్‌లాండ్ చట్టాల ప్రకారం అది నేరం. దీనిపై తాజాగా వివాదం చెలరేగింది. దాంతో అస్థిల్దూర్ లోవా థోర్సోడొట్టిర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.