దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశాం.. మంచి పని చేసిన మాకు శిక్ష వేస్తారా? అని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. న్యాయబద్ధం కానీ డీలిమిటేషన్‌పై మనమంతా బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుందని, ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ చెన్నయ్‌లో జరిగిన డీలిమిటేషన్ సదస్సులో ఆయన ఈ మేరకు మాట్లాడారు.