ఐప్యాక్‌కు వైసీపీ గుడ్ బై చెప్పేసిందా?

85చూసినవారు
ఐప్యాక్‌కు వైసీపీ గుడ్ బై చెప్పేసిందా?
AP: ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐప్యాక్) సేవలతోనే వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చింది. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి ఎదురు కాగానే.. ఐప్యాక్ సేవలను వైసీపీ వద్దనుకుంది. దాదాపు పదేళ్లకుపైగా ఐప్యాక్, వైసీపీల మధ్య బంధం సాగింది. కానీ ఇప్పుడు ఆ సంస్థ సేవలను వైసీపీ రద్దు చేసుకుంది. ఐప్యాక్ లేని సమయంలో ప్రచార భారం పార్టీ సోషల్ మీడియా విభాగంపైనే పడుతోంది. దాంతో వైసీపీ ఇప్పుడు ఏ సంస్థ సేవలను వినియోగించుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

సంబంధిత పోస్ట్