AP: రాష్ట్రవ్యాప్తంగా శనివారం తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మెగా సమావేశం జరగనుంది. 45,094 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. 35,84,621మంది విద్యార్థులు, 71.60 లక్షల మంది తల్లిదండ్రులు, 1,88,266 మంది ఉపాధ్యాయులు, 50 వేలకు పైగా ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరవుతారు.