తమిళ సీనియర్ దర్శకుడు జయభారతి (77) అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్ కారణంగా హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 1979లో క్రౌడ్ ఫండింగ్ విధానంలో 'కుడిసై' చిత్రాన్ని రూపొందించి తమిళ సినీ పరిశ్రమలో గుర్తింపు పొందారు.