ఓట్లు, సీట్లు కారణంగానే పలు రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు: ప్రధాని మోదీ

59చూసినవారు
ఓట్లు, సీట్లు కారణంగానే పలు రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదు: ప్రధాని మోదీ
ఓట్లు, సీట్లు కారణంగానే తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని ప్రధాని మోడీ విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని అష్టలక్ష్మి మహోత్సవ్‌ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. గత ప్రభుత్వాలు చాలా కాలంగా ఓట్ల సంఖ్యతో అభివృద్ధిని ఎలా తూకం వేశాయో చూశామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఓట్లు, సీట్లు తక్కువగా ఉండటంతో గత పాలకులు అభివృద్ధిపై దృష్టిపెట్టలేదని దుయ్యబట్టారు. రాబోయే రోజులన్నీ.. తూర్పు, ఈశాన్య రాష్ట్రాలదేనని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్