పశువులలో వచ్చే క్షయవ్యాధి లక్షణాలు ఇవే

71చూసినవారు
పశువులలో వచ్చే క్షయవ్యాధి లక్షణాలు ఇవే
పశువులలో వచ్చే ముఖ్యమైన బ్యాక్టీరియల్‌ వ్యాధులలో క్షయవ్యాధి ఒకటి. ఇది మైకోబ్యాక్టీరియం అనే వ్యాధి కారకము ద్వారా వస్తుంది. ఈ వ్యాధిగ్రస్త పశువుల పాలు వాటి దూడలు తాగటం వలన వాటికి కూడా ఇది వ్యాపిస్తుంది. శ్వాస ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. పౌష్టికాహారము తీసుకున్నప్పటికి పశువులు రోజు రోజుకు కృషించిపోవుట, తెమరుతో కూడిన విపరీతమైన దగ్గు వంటి వ్యాధి లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ వ్యాధి సోకిన పశువులను మందకు దూరం చేసి, చికిత్స అందించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్