రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించాలని కోరుతూ శంభు సరిహద్దు వద్ద రైతులు చేపట్టిన ఉద్యమంలో వినేశ్ ఫొగాట్ పాల్గొన్నారు. ‘‘నేను ఓ రైతు కుటుంబంలో జన్మించినందుకు చాలా అదృష్టవంతురాలిని. మీరంతా మీ హక్కల విషయంలో హామీ పొందిన తర్వాతే ఇళ్లకు చేరాలని దేవుడుని కోరుకుంటాన్నా. నా ప్రధాన లక్ష్యం హక్కుల కోసం పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలవటం’’ అని ఆమె అన్నారు.