ఎన్నికల సమయంలో ఇదంతా మాములే: పెద్దిరెడ్డి

72చూసినవారు
ఎన్నికల సమయంలో ఇదంతా మాములే: పెద్దిరెడ్డి
వైసీపీ అభ్యర్థుల మార్పులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో అసంతృప్తి సహజంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సరైన పనితీరు కనపరచని వారికి పార్టీ టికెట్ ఇవ్వడానికి నిరాకరించిందన్నారు. అలాంటి వారు అసంతృప్తిలో ఉండటం మాములే అని అన్నారు. పార్టీ గెలిచే వారికే టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంటుందని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్