అరకు: విజృంభిస్తున్న చలి

84చూసినవారు
అరకులోయ మన్యంలోని చలితో ప్రజలు వణుకుతున్నారు. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు శనివారం పడిపోయాయి. శనివారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. దీనితో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో ప్రజలు చలికి గజగజ వణికిపోయారు. ఉదయం సాయంత్రం సమయంలో చలి ప్రభావం మరింత అధికంగా ఉంటుంది. దీంతో ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తూ ఉదయం 10 గంటలు దాటితే గాని ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్